బీఆర్‌ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై కీలక సమావేశం

బీఆర్‌ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై కీలక సమావేశం

మేడ్చల్, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు “బాకీ కార్డు ఉద్యమం”ను మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు.ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్యనాయకులు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణరావు, వివేకానంద గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, అలాగే మాల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిలతో పాటు జిల్లా ముఖ్యనాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను పూర్తిగా అమలు చేయక ప్రజలను మోసం చేసిందని, ప్రజల పట్ల కాంగ్రెస్ యొక్క ఈ మోసపూరిత వైఖరిని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ “బాకీ కార్డు ఉద్యమం” రూపంలో ప్రజల్లోకి వస్తోందని తెలిపారు.
ప్రజల సమస్యలను నిజాయితీగా పరిష్కరించేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నారు అని నాయకులు స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .