వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
బాక్స్ డ్రైన్ పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,
కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి
మల్లాపూర్, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ కాలనీలో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 60 లక్షల రూపాయల వ్యయంతో బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రతి వర్షాకాలంలో కాలనీవాసులు ఎదుర్కొంటున్న వరద సమస్య ను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఈ బాక్స్ డ్రైన్ పూర్తయ్యాక నీటి నిల్వ సమస్య తీరిపోతుంది” అన్నారు. ప్రజల సౌకర్యం కోసం జిహెచ్‌ఎంసీ అధికారులు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో జిహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్ డిఈ రూపా, ఏఈ శ్రవంతి, కాలనీ వాసులు పరమేష్ రెడ్డి, మధు, రమేష్, ప్రతాప్ రెడ్డి, అశోక్ రెడ్డి, సోమయ్య, సారంగపాని మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments