నాచారంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

నాచారంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

నాచారం, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)

నాచారం ప్రధాన రహదారిపై వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. హబ్సిగూడ నుండి రాఘవేంద్ర నగర్, న్యూ రాఘవేంద్ర నగర్, శ్రీ రాఘవేంద్ర నగర్, అన్నపూర్ణ కాలనీ, ఇందిరానగర్, శాంతి గార్డెన్స్, రైతు బజార్‌తో పాటు జాన్సన్ గ్రామర్, సెయింట్ పీటర్స్, డెక్కన్ స్ప్రింగ్స్ వంటి పాఠశాలలకు వెళ్తున్న వాహనదారులు చాలా కాలంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు.
రాఘవేంద్ర నగర్ చౌదరి హార్డ్‌వేర్ ముందు ఉన్న ఓపెనింగ్ మూసివేయడంతో వాహనదారులు ఈఎస్ఐ హాస్పిటల్ వరకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వచ్చేది. దీని కారణంగా రాంగ్ రూట్‌లో ప్రయాణాలు, తరచూ ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీలు జరిగేవి. వాహనదారులు చలానాలతోనూ ఇబ్బందులు పడేవారు.ఈ సమస్యపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, గురువారం ఇంజనీరింగ్, ట్రాఫిక్ అధికారులు కార్పొరేటర్‌తో కలిసి సమీక్షించారు. అనంతరం చౌదరి హార్డ్‌వేర్ ముందు రోడ్డును తిరిగి తెరిచే పనులు ప్రారంభమయ్యాయి.రోడ్డు మధ్య సెంట్రల్ మీడియన్‌లో భాగాన్ని తొలగించి విశాలమైన ఓపెనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా స్కూల్ వ్యాన్లు, పెద్ద వాహనాలు సులభంగా యూటర్న్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ నియంత్రణ కోసం మొదట కానిస్టేబుల్‌ను నియమించి, తరువాత సిగ్నల్, హైమాస్టర్ లైట్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.కాలనీవాసులు ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిఈ బాలకృష్ణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు నాగరాజు, నాయక్, బిఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, కట్ట బుచ్చన్న గౌడ్, విటల్ యాదవ్, సుగుణాకర్ రావు, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .