బాలికలకు రెసిడెన్షియల్ పాఠశాల బంగారు భవిష్యత్ ను ఇవ్వాలి.
మంచి సంస్కృతి సాంప్రదాయాలతో సమాజంలో పౌరుడిగా ఎదగాలని కోరుతున్నా..
కన్న కలలు సాకరమయ్యేందుకు విద్యార్థిని లు నిరంతరం శ్రమించాలి..
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
మెదక్ జిల్లా ప్రతినిధి డిసెంబర్, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మెదక్ జిల్లాలో ఆదివారం పర్యటించి కుల్చారం మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థినిలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి చర్చా కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను కళాశాల విద్యార్థినులు గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు విభిన్న సంస్కృతి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు.
విద్యార్థినులు వేసిన పలు ప్రశ్నలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమాధానాలు ఇచ్చారు.
క్రీడలలో బ్యాడ్మేంటిన్ క్రీడ అంటే ఇష్టమని, భారత మాజీ ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు ఆదర్శమని, నిరంతరం చదవడం, రాయడం పైనే ఆసక్తి చూపుతానని, పుస్తకాలే తన నేస్తమన్నారు. అంతకంటే ఎక్కువగా పిల్లలతో గడపడం మరింత ఇస్తామన్నారు.
చిన్నారులు చక్కని ప్రశ్నలు వేశారని, అవి తనను ఎంతో ఆనందింప జేశాయన్నారు.
దేశ భవిష్యత్తు కు పునాదిలాంటి వారని, సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలన్నారు. విద్యాలయాలు దేవాలయాలతో సమానమని, చిన్నతనం నుండే క్రమశిక్షణతో మెసలుతూ
మంచి నాగరికత పుణికి పుచ్చుకొని భవిష్యత్ కు మార్గ నిర్ధేశనం చేసుకోవాలన్నారు. మెదక్ పార్లమెంటు సభ్యుడు 
రఘునందన్ రావు మాట్లాడుతూ...దేశప్రగతి విద్యార్థుల తరగతి
గదులలోనే అన్ని స్వామి వివేకానంద అన్నట్లు చెబుతూ విద్యను ఇష్టతతో అభ్యసించాలన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్న రెసిడెన్షియల్ పాఠశాలల లక్ష్యాలను ప్రశంసించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. విద్యార్థినులు భిన్న సంస్కృతులను మేళవిస్తూ ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయన్నారు.
విద్యార్థులు పట్టుదల,క్రమశిక్షణతో ఉన్నత స్థానానికి ఎదగాలని అనుకున్న విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలు పునాది లాంటివని, తప్పనిసరిగా అనుకున్న లక్ష్యాలను సాధించ గలుగుతారన్నారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఘనంగా సన్మానించారు.
అనంతరం రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపుల్ సెక్రటరీ దాన కిషోర్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రెటరీ అలుగు వర్షిణి అదనపు కలెక్టర్ నగేష్ , సంబంధిత శాఖల అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments