డ్రగ్స్ పై పోరాటంలో మత గురువుల ముందడుగు

 ధార్మిక జనమోర్చా సమావేశం

డ్రగ్స్ పై పోరాటంలో మత గురువుల ముందడుగు

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

నేటి యువతరం మద్యం, మాదకద్రవ్యాల మత్తులో జోగుతోంది. మత్తు పదార్థాలను నివారించాల్సిన బాధ్యత మత గురువులపై ఉందని, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మత గురువులంతా ముక్తకంఠంతో తీర్మానించారు. తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటోంది.   యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాల ముప్పును అరికట్టడంలో మత గురువులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పలువురు మత గురువులు పిలుపునిచ్చారు. లకడీకాపూల్ లోని హోటల్ అశోకాలో ధార్మిక జనమోర్చా ఆధ్వర్యంలో ‘మాదక ద్రవ్యాల ముప్పును అరికట్టడంలో మత గురువుల పాత్ర’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. తామంతా ఏకమై నైతిక విలువలను కాపాడేందుకు మాదక ద్రవ్యాలను నిర్మూలించడానికి నడుంబిగించాలని వారంతా పిలుపునిచ్చారు. ధార్మిక జనమోర్చా నేషనల్ కన్వీనర్ డా.సలీమ్ ఇంజనీర్ అద్యక్షతన ఈ సమావేశం జరిగింది. సలీమ్ ఇంజనీర్ మాట్లాడుతూ.. సామాజిక జాడ్యాలను నిర్మూలించేందుకు అన్ని మతాల గురువులు ఒకేవేదికమీదకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పిల్లల్ని చిన్ననాటి నుంచే ధార్మిక చింతనతో, నైతిక విలువలతో పెంచాలన్నారు. నేటి యువతరానికి డ్రగ్స్ తీవ్ర సవాలుగా మారిందన్నారు. చిలుకూరి బాలాజీ టెంబపుల్ పండితులు లక్ష్మీ నరసింహులు మాట్లాడుతూ పిల్లలకు బాల్యంనుంచే భక్తిని అలవర్చాలని, పెద్దయ్యాక వ్యసాలకు దూరంగా ఉంటారన్నారు. మద్యం, మత్తు గొలిపే మాదక ద్రవ్యాలను ప్రభుత్వాలు ఎందుకు నిషేధించడం లేదని ఆయన ప్రశ్నించారు. జమాఅతె ఇస్లామీహింద్ నాయకురాలు డాక్టర్ అస్రా మొహసినా మాట్లాడుతూ.. ధార్మిక గురువులు తమ ధార్మిక కలాపాలతో పాటు సామాజిక బాధ్యతకోసం సమయం కేటాయించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని, వారి సాధక బాధకాలు శ్రద్ధగా వినాలన్నారు. మన పిల్లలతో మనం స్నేహంగా మెలగకపోతే వారు వేరే ఫ్రండ్స్ ను వెతుక్కుంటారని, ఆ తరువాత జరిగే అనర్థాలకు చింతించాల్సిన దుస్థితి వస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. లింగాయత్ మఠ్ ప్రతినిధు ప్రభుదేవ స్వామిజీ మాట్లాడుతూ మన యువతరాన్ని వ్యసనాల బారిన కాపాడుకోవడం ధార్మిక పెద్దల కర్తవ్యమని అన్నారు. చర్చి ఫాదర్ అనంతయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరి శరీర ఆత్మలో దేవుడుంటాడని, అలాంటి శరీరాన్ని మత్తులో జోగడం పాపమని అన్నారు. పిల్లలను చదువులతో పాటు ఆటల్లో ప్రోత్సహించాలని, ఎన్సీసీలో తర్ఫీదు ఇస్తే వ్యసనాల బారినుంచి తప్పించవచ్చని సందీప్ థాకూర్ అన్నారు. ధార్మిక జనమోర్చా స్టేట్ కన్వీనర్ ఆతిఫ్ ఇస్మాయీల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజు రోజుకు మాదకద్రవ్యాల ముప్పు ఆందోళనకరంగా మారిందని అన్నారు.

పసిపిల్లలూ అడిక్ట్ అవుతున్నారు..

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల ముప్పు కాలేజీలతోపాటు స్కూళ్లకూ పాకిందని నార్కోటిక్ డీఎస్పీ సుబ్బిరామిరెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. పిల్లలకు గంజాయి చాక్లెట్ల ద్వరా అలవాటు చేస్తున్నారని అన్నారు. ఒకప్పడు 111 రకాల డ్రగ్స్ ఉండేవని ఇప్పుడు 250 రకాల డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయని ఆయన వివరించారు. పేరెంట్స్ తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని, వారిపై నిఘా పెట్టాలని ఆయన అన్నారు. డ్రగ్స్ పోరాటంలో ప్రభుత్వంతోపాటు పేరెంట్స్, ఎన్జీవోలు, ధార్మిక సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .