ఏపూరి సీతయ్యకి నన్మానం

ఏపూరి సీతయ్యకి నన్మానం

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

పార్టీ 100వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా 50సంవత్సరాలుగా సీపీఐ పార్టీ సభ్యత్వం కల్గిన నాగిలిగొండ గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు ఏపూరి సీతయ్య దంపతులను సీపీఐ జాతియనమితి సభ్యులు భాగం హేమంతరావు శుక్రవారం నాగిలిగొండ గ్రామంలో సన్మానించారు. ఈ సందర్భంగా భాగం హేమంతరావు మాట్లాడుతూ 99 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ సుదీర్ఘ చరిత్రలో అనేక పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, త్యాగాలు ఉన్నాయని, కార్ముక, కర్షక, హక్కుల కోసం పోరాడిన ఏకైక పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు. దేశంలో కమ్యూనిస్టుల అవసరం పెరుగుతందని మతోన్నాద శక్తులు బరితెగించిన వేళ దేశంలో లోకకవాదం ప్రమాదంలో పడిందని, బీజేపీతో దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. కమ్యునిస్టు పార్టీ చరిత్రలో పోరాటాల పురిటిగడ్డగా ఖమ్మం జిల్లా ఖ్యాతి గడించిందన్నారు. జిల్లాలో ప్రతిగ్రామానికి ప్రతి కుటుంబానికి ఉద్యమ చరిత్ర ఉందన్నారు. పార్టీ 100వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ప్రజాపోరాటాలకు పునరంకితమవుదామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయకార్యదర్శి దండి నురేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జుమ్ముల సికిందర్ రెడ్డి, ఎర్రబాలు, మండల నాయకులు పదిమల వెంకటనర్సయ్య, షైక్ చిన్న జాన్, అరికొట్ల భాన్కర్,పంది వుల్లయ్య, చాట్ల రమేష్, ఎవూరి నర్సయ్య అద్దంకి ఏలియా, మాజీ సర్పంచ్ చాట్ల మురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .