కాజీపేటలో కేటీఆర్ కు ఘన స్వాగతం
కాజీపేట్ నవంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు)
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు కు కాజీపేటలోని బాపూజీ నగర్ చౌరస్తాలో బుధవారం ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హనుమకొండలో నిర్వహించనున్న దీక్ష దివస్ కార్యక్రమానికి విచ్చేసిన కేటీఆర్ కు బాపూజీ నగర్ లో జై కేటీఆర్ జై జై కేటీఆర్ జై కేసీఆర్ జై జై కేసీఆర్ అంటూ ఆ ప్రాంతమంతా నినాదాలతో మార్మోగింది. అనంతరం కేటీఆర్ వరంగల్ కు తరలి వెళ్లారు ఆయనతోపాటు హనుమకొండ జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వినయ్ భాస్కర్ నగర డిప్యూటీ మేయర్ రిజ్వాన మసూద్ నాగుల వెంకటేశ్వర్లు లతోపాటు స్థానిక నాయకులు కార్పొరేటర్ సంకు నర్సింగరావు టిఆర్ఎస్ నాయకులు రమేష్ ,సిరిమల్లె దశరథం, శివకుమార్, దువ్వ కనకరాజు, రంజిత్, తేలు సారంగపాణి, బసవ యాదగిరి, కాటాపురం రాజు, అఫ్జల్, సుంచు అశోక్, పర్వీన్, మరియాలకృష్ణ, పప్పుల గోవర్ధన్, సిద్దుల తో పాటు తదితరులు పాల్గొన్నారు.


Comments