హౌసింగ్ ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ మహిళా ఆత్మహత్య 

హౌసింగ్ ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ మహిళా ఆత్మహత్య 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
హౌసింగ్ ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ మహిళా ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్న ఘటన  మండలంలోని ఏలుకుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
ధర్మసాగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలుకుర్తి గ్రామానికి చెందిన కేతిరి వెంకటయ్య కూతురు ఎలేంద్ర(35)ను స్టేషన్ ఘనపూర్ గ్రామానికి చెందిన అంగడి ఉపేందర్ కి 17 సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం చేశారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.గత ఆరు సంవత్సరాల క్రితం వారి సొంత గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ నుండి 15లక్షలు రుణాన్ని తీసుకున్నారు.ఇట్టి రుణాన్ని వాయిదాల పద్దతిలో కట్టుకుంటూ వస్తున్నారు.ఇంకొంత కట్టాల్సి ఉండగా ఆర్థిక భారంతో వాయిదాలు చెల్లించలేకపోయారు.అప్పటికే ఫైనాన్స్ వారి వేధింపులు మొదలయ్యాయి.ఇట్టి విషయాన్నీ ఎలేంద్ర తన తండ్రి కేతిరి వెంకటయ్యకు పలుమార్లు తాను ఎదుర్కొంటున్న  ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ  ఆవేదనకు గురైనట్లు తన తండ్రి పేర్కొన్నారు.ఇటీవల హౌసింగ్ ఫైనాన్స్ వారు మరింత ఒత్తిడి తెస్తూ ఎలేంద్ర ఇంటికి నోటీసులు అంటించారు.మనస్తాపం చెందిన అంగడి ఎలేంద్ర గురువారం మధ్యాహ్నం 1 గంటలకు ఘనపూర్ నుండి ఏలుకుర్తిలోని తన తల్లితండ్రుల నివాసానికి చేరుకొని ఇంటి ముందర గల చింత చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఎలేంద్ర తండ్రి కేథిరి వెంకటయ్య చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మసాగర్ ఎస్సై తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .