అప్రమత్తతతోనే ప్రమాదాలను చాకచక్యంగా నివారించవచ్చు.
సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఊటుకూరి సునీత.
సత్తుపల్లి, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
అప్రమత్తతతోనే ప్రమాదాలను చాకచక్యంగా నివారించవచ్చని సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఊటుకూరి సునీత అన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక అదనపు అధికారి వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్యాస్ లీకేజీ, వంట గదుల్లో జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు వంటి సందర్భాల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరణ ఇచ్చారు. ప్రమాద సమయంలో ప్రథమ చికిత్స ఎలా అందించాలి, మంటలనుఅదుపు చేయడానికి ఉపయోగించే పరికరాలు, వాటి వినియోగం ఎప్పుడు ఎలా చేయాలనే అంశాలపై వివరించారు.
ఏదైనా అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే 101 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి, చిన్న పొరపాట్ల వల్ల పెద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పీ. విజయశ్రీ, ఎంఎఫ్ సిలివేరు సాహితీతో పాటు ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు పాల్గొన్నారు.


Comments