తుమ్మలను కలిసిన ఏసీపీ వసుంధర.
Views: 25
On
సత్తుపల్లి, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
కల్లూరు ఏసీపీగా నియమితులై చార్జ్ తీసుకున్నై ఐపీఎస్ అధికారి వసుంధర యాదవ్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో సోమవారం ఉదయం వసుంధర యాదవ్ తుమ్మలను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ఈ సందర్బంగా, మండలంలో న్యాయవ్యవస్థ, శాంతి భద్రతల నిర్వహణ, ప్రజలకు చేరువగా సేవలు అందించే దిశగా చేపట్టబోయే కార్యక్రమాలపై సౌజన్యంగా చర్చించినట్టు సమాచారం.
ఏసీపీ వసుంధర యాదవ్ తో పాటు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కూడా తుమ్మలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments