ఇంటిస్థలం ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి
--- అనుమతి లేకుండా నాలుగు అంతస్తుల అక్రమ నిర్మాణం --- విలేకరుల సమావేశంలో బాధితుడు చల్లా మణి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
భార్యకు వారసత్వంగా ఇచ్చిన ఇంటి స్థలమును రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ అక్రమంగా ఆక్రమించుకుని నాలుగు అంతస్తుల బిల్డింగు కడుతున్న పసుమర్తి శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చల్లా మణి విలేకరుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చల్లా మణి మాట్లాడుతూ... ఖమ్మం నగరంలో ఇంటి నెంబర్ 10-2-5 లో గల సుమారు 200 గజాల ఇంటి స్థలాన్ని మామ జన్ను మహంతి స్వామిరావు మరణించక ముందు తన భార్య స్వప్నకు వారసత్వంగా ఇచ్చిన స్థలాన్ని జన్ను మహంతి వెంకటేశ్వరమ్మ, జయంత్, సూర్యనారాయణ, పసుమర్తి శ్రీనివాస్ లు కలసి అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, కేసు నమోదైనా అట్టి స్థలంలో నాలుగు అంతస్తుల బిల్డింగ్ కడుతూనే ఉన్నారని ఆరోపించాడు. జిల్లా అధికారులే తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.


Comments