ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి
Views: 3
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ప్రజావాణి కార్యక్రమంలో అందిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ఈ సూచనలు చేశారు.
కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై 88 అర్జీలను సమర్పించారు. వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వ్యవహరించాలని వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, డిఆర్డీవో మేన శ్రీను, హనుమకొండ మరియు పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణతో పాటు ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments