ముఖ్యమంత్రి అయ్యాక ముఖం చాటేసిండు
బిఆర్ఎస్వి నాయకులు లకావత్ చిరంజీవి
సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను మరచిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం కొలువై ఏడాది దాటినా మాట నిలబెట్టుకోని ప్రభుత్వ వైనం
పది రోజులుగా సమ్మె చేస్తున్నా స్పందిచన ప్రభుత్వం
కేజీబీవీ పాఠశాలలో నిలిచి పోయిన విద్యాబోధన పట్టించుకోని ప్రభుత్వం
సమ్మెలో పాల్గొని మద్దతు ప్రకటించిన విద్యార్థి జేఏసీ నాయకులు చిరంజీవి
స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు
స్టేషన్ ఘనపూర్: తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించి, వారికి పర్మినెంట్ చేయాలని భారత రాష్ట్ర సమితి అనుబంధ విద్యార్థి విభాగం బిఆర్ఎస్వీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గత పది రోజుల పాటు
తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు చేస్తున్నా నిరవధిక సమ్మెలో పాల్గొని వారికి మద్దతు తెలియపరచడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 ఏడ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్నా సమగ్ర సర్వశిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలని , హెల్త్ కార్డులు, ఆరోగ్య భీమా, జీవిత బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ , మరణించిన కుటుంబాలకు ఎక్సెగ్రెసియా అందజేయాలని, పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైం ఉద్యోగులు గా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. గత 18 సంవత్సరాల నుండి చాలి చాలని వేతనం, ఇక నైనా పర్మినెంట్ కాదని ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల బ్రతుకులు మారడం లేదని, గత సంవత్సరంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో అప్పటి పీసీసీ చైర్మన్ హోదాలో వచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు సరైన న్యాయం చేసి, మిమ్ములను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ఉద్యోగులకు న్యాయం చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులనందరిని రెగ్యులర్ చేయాలని, జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో సరైన న్యాయం జరిగేలా ప్రకటన చేసి ఆదుకోవాలని ఆయన అన్నారు. నిరవధిక సమ్మె చేయడం ద్వారా కేజీబీవీ పాఠశాలలో చదువులు కొనసాగడం లేదన్నారు. దీని వలన విద్యార్థినులు చదువులో వెనుకబడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి చేస్తున్నా నిరవధిక సమ్మె విరమించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్నా పోరాటానికి భారత రాష్ట్ర సమితి, అనుబంధ విద్యార్థి విభాగం అండగా నిలుస్తామని అన్నారు.


Comments