కేంద్రం 4 లేబర్ కోడ్‌లకు సింగరేణి కార్మికుల ఆందోళన.!

జి.ఎం కార్యాలయం ముందు ధర్నా, వినతిపత్రం అందజేత.

కేంద్రం 4 లేబర్ కోడ్‌లకు సింగరేణి కార్మికుల ఆందోళన.!

సత్తుపల్లి, నవంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణంలో కార్మిక భద్రతా చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చిన కేంద్ర నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు జే.ఏ.సీ ఐక్య కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి.

కార్మికుల హక్కులను రక్షించేందుకు రూపుదిద్దుకున్న అనేక కార్మిక చట్టాలను చెల్లాచెదురుగా చేసి వాటిని నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వాటి అమలును వెంటనే రద్దు చేయాలని జే.ఏ.సీ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ డిమాండ్ చేసింది.

సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు జే.ఏ.సీ కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించి, జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.

సత్తుపల్లి కార్మిక నాయకులు పేర్కొన్నారు – కార్మికులను తక్కువ జీతాలతో, హక్కులు లేని వాతావరణంలో కట్టుబానిస కార్మికులుగా మార్చేందుకు కార్పొరేట్ ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వం 29 కార్మికుల భద్రత చట్టాలను మార్చిందని. నాలుగు కోడ్స్‌లోని మార్పులు కార్మిక భద్రత, జీతభత్యాలు, కార్మిక హక్కులు, యూనియన్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారు హెచ్చరించారు. దేశ నిర్మాణంలో కీలకమైన కార్మిక వర్గాన్ని బలహీనపరచే ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఐఎన్టియూసీ బ్రాంచ్ సెక్రెటరీ తీగల క్రాంతికుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సముద్రాల సుధాకర్, సిఐటియు ప్రతినిధి కార్తీక్, ఐఎన్టియూసీ నాయకులు నాగ ప్రకాష్, బాలాజీ, నాగేశ్వరరావు,మురళి, కోటి, బాజీ, ఏఐటీయూసీ నాయకులు భరణి, నరసింహారావు, ప్రసాద్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.IMG-20251126-WA0079

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .