పోరాట స్ఫూర్తి నింపిన ఐలమ్మ
పోటు ప్రసాద్ సి.పి.ఐ ఆధ్వర్యంలో ఘన నివాళీ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
సాయుధ తెలంగాణ పోరాటంలో కీలక భూమిక పోషించిన చిట్యాల ఐలమ్మ పోరాట స్పూర్తిని నింపిందని సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. ఐలమ్మ తిరుగుబాటు తరువాత సాయుధ పోరాటానికి ఒక కొత్త ఊపు వచ్చిందని సామాన్యులు సైతం సాయుధ పోరాటం వైపు ఆకర్శితులైయ్యారన్నారు. చిట్యాల ఐలమ్మ 39వ వర్థింతి సందర్భంగా పాత కలెక్టరేట్కు ఎదురుగా ఉన్న ఆమె విగ్రహానికి సి.పి.ఐ జాతీయ సమితిసభ్యులు తదితరులు మంగళవారం పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఐలమ్మ వెనుకబడిన తరగతుల జాతికి చెందిన మహిళా అని అక్కడ భూస్వామ్య పెత్తందార్లు ఆమెను వెట్టి చేయాలని ఒత్తిడి తెచ్చారని దానికి ఆమె ఆంగీకరించక సంఘాన్ని ఆశ్రయించిందన్నారు. విస్నూర్దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఐలమ్మసాగుభూములను విచ్చిన్నం చేయడమేగాక పండిన పంటను సైతం జమిందార్ అనుచరులు దోచుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. ఈ క్రమంలో ఐలమ్మ ఎదురు నిలిచి భూస్వామ గుండాలను తరమి కొట్టిందన్నారు. అప్పటికే పాలకుర్తిప్రాంతంలో ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుపార్టీ పోరాటాలు ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో పోరాటాలు సాగుతున్న క్రమంలో ఐలమ్మకు మద్దతుగా నిలిచిన ఆరుట్లతోపాటు, ఐలమ్మ కొడుకులను సైతం జైల్ పాలు చేశారన్నారు. ఐలమ్మ తిరుగుబాటు యావత్తు తెలంగాణకు స్పూర్తి నిచ్చిందన్నారు. ఐలమ్మ పోరాట స్పూర్తితో ప్రజా పోరాటాలు చేపట్టాలని పోటు ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రజలను విస్మరించి పాలకులు పాలన సాగిస్తున్నారని దేశవ్యాపితంగా ఆర్థిక అంతరాలు పెరిగి పోతున్నాయని ప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బహుముఖ పోరాటాలు చేపటడమే ఐలమ్మకు మనమిచ్చేనివాళీ అన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, జిల్లా కార్యవర్గసభ్యులు శింగునర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, రావి శివరామకృష్ణ, సి. హెచ్.సీతామహాలక్ష్మి, తోట రామాంజనేయులు, మేకల శ్రీనివాసరావు, జిల్లా సమితి సభ్యులు యానాలి సాంబశివరెడ్డి, పైడిపల్లి ఏసు, గాదె లక్ష్మినారాయణ, నూనె శశిధర్, పి.మోహన్ రావు, తాటి నిర్మల, ఎ.ఐ.ఎస్.ఎఫ్, ఎ.ఐ.వై.ఎఫ్ జిల్లా కార్యదర్శులు ఇటికాల రామకృష్ణ, నానబాల రామకృష్ణ, నాయకులు పోటు పూర్ణ, మేకల రవి, జ్వాల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.


Comments