కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తా
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా, నవంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీల అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం కాప్రా డివిజన్ పరిధిలోని వినాయక నగర్ ఫేస్–3 లో రూ.10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బైరి నవీన్ గౌడ్, బద్రుద్దిన్, ఇంద్రయ్య, మహేష్, గిల్బర్ట్, రవీందర్, చందు, అలాగే కాలనీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రాజేందర్, సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments