నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. 

శ్రీ భవాని రియల్ ఎస్టేట్ అధినేత యర్రా రమేష్.

నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. 

ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:

నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని శ్రీ భవాని రియల్ ఎస్టేట్ అధినేత యర్రా రమేష్ అన్నారు. ఈరోజు ఖమ్మం 3 టౌన్ లో స్థానిక 30 వ  డివిజన్లో ఉదయం నుండి యర్రా రమేష్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతీ కుటుంబానికి నూతన సంవత్సర క్యాలెండర్ మరియు ప్రజల నోరు తీపి చేయడం కోసం సంవత్సరం కాలమంతా తీపి కబుర్లతో సంతోషంగా ఉండాలని కోరుతూ ఒక స్వీట్ బాక్స్ ను కూడా ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సుమారు డివిజన్లో ఉన్న ప్రతి కుటుంబానికి  కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా భవాని రియల్ ఎస్టేట్ అధినేత యర్రా రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా జనవరి మొదటి తారీఖున ఉదయం 8 గంటల నుండి యర్రా  రమేష్ అనుచరు బృంద యువకులతో ప్రతి ఇంటికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్ బాక్స్ అందించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా గడపగడపలో ఎర్ర రమేష్ అన్న వస్తాడని క్యాలెండర్ స్వీట్ బాక్స్ ఇస్తాడని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతాడని ఎదురుచూస్తూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఆప్యాయంగా పలకరిస్తూ వారి దీవెనలు కూడా ఇస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వారి సంతోషం వారి కళ్ళల్లో వారి ముఖంలో కనపడుతుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అందుకే ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను ఇదేవిధంగా మునుముందు కూడా ఇలాగే ఉండాలని ఇలాగే కొనసాగాలని ప్రజలకు సహాయ సహకారాలు అందించగలిగే శక్తిని ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని ఇంకా మునుముందు ప్రజలకు ఇంకా సహాయ కార్యక్రమాలు చేయడానికి నాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ హిమామ్, ఎర్ర రంజిత్, రంగు హనుమంతచారి, ఎర్ర నగేష్, కుడాలి శ్రీను, చింతల ఉపేందర్, చిత్తలూరి రాజయ్య, మద్ది శ్రీను, పుట్ట బంతి లక్ష్మీనారాయణ, అరవపల్లి వేణు, తంగేళ్లపల్లి బలరాం, హరికృష్ణ, నూనె నందు, సాగర్, నరసింహ, పిట్టల లక్ష్మీనారాయణ, వేల్పుల మధు, పెద్దోజు నరసింహ చారి, శ్రీను, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .