శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు 

డిసెంబర్ 5న నిర్వహించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 

మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం రఘునాధపాలెం వద్ద నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణ ప్రదేశంను పరిశీలించారు. 

ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపనకు రాష్ట్ర మంత్రులు విచ్చేయనున్నారని,  అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మెడికల్ విద్యార్దుల అవసరాల దృష్టా నూతన వైద్య కళాశాల భవన నిర్మాణం కోసం రఘునాధపాలెం వద్ద భవన నిర్మాణ పనులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, మంత్రులతో శంకుస్థాపనకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఉంటే దానికి తగ్గ ఏర్పాట్లను కూడా సిద్దం చేస్తామని తెలిపారు. మంత్రుల పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, సభా స్థలం, సౌండ్ సిస్టం, ప్రజలకు సరిపడా కుర్చీలు, టెంట్, సభా వేదిక ప్రత్యేకంగా పరిశీలించి ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రాజేశ్వర రావు, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, అధికారులు, తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .