కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు విస్తరణకు అనుమతించండి

కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు విస్తరణకు అనుమతించండి

 కరోనా కాలంలో నిలిచిన ఐదు రైలు సర్వీసులను పునరుద్ధరించండి

దక్షిణ మధ్య రైల్వే జీఎంతో భేటీలో కోరిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
ఉభయ జిల్లాలకు సంబంధించి పలు అంశాల ప్రస్తావన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఉభయ జిల్లాలకు సంబంధించి పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కోరారు. మంగళవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో ఆయనతో భేటీ అయ్యారు. పలు గ్రామాలను అనుసంధానించే రోడ్డు కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో.. చాలా ఇరుకుగా ఉందని, దీని విస్తరణ అనేక ఏళ్లుగా  అపరిష్కృతంగా ఉందని ప్రస్తావించారు. రైల్వే కి సంబంధించిన స్థలాన్ని రోడ్డు విస్తరణకు కేటాయించాలని, ఇందుకోసం కేంద్ర రైల్వే మంత్రిని సంప్రదించి వివరిస్తానని తెలిపారు. ఇంకా..కోవిడ్ ఆపత్కాలంలో నిలిచిపోయిన, ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఆ సర్వీసులను పునరుద్ధరించాలని ఎంపీ కోరారు. మణుగూరు - ఖాజీపేట (వయా భద్రాచలం రోడ్), డోర్నకల్ - భద్రాచలం రోడ్, బెల్గాం - భద్రాచలం రోడ్, ఖాజీపేట -  విజయవాడ, విజయవాడ - పెద్దపల్లి రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించాలని జీఎంను కోరారు. సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ రైలును మణుగూరు వరకు పొడిగించాలని జీఎంను కోరారు. ఖమ్మం రైల్వే స్టేషన్ సమీప శ్రీనివాసనగర్ వద్ద అదనపు ట్రాక్ విస్తరణ పనులతో డ్రెయినేజీ వ్యవస్థ దెబ్బతిందని, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాలని ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. కొత్త రైల్వే లైన్ల కోసం ప్రణాళిక రూపొందించాలని అన్నారు.  ఈ సందర్భంగా రైల్వే జీఎం స్పందిస్తూ.. తప్పకుండా ఆయా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎంపీకి హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .