పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం ఏర్పాట్టు చేసినా పూర్వ విద్యార్తి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెబ్బేరు మండలం యాపర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి రత్నకుమార్ గౌడ్, తాను పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతికి హాజరైన విద్యార్థులకు అల్పాహారం అందిస్తామన్నారు. మా ఊరిలో నీ పూర్వ విద్యార్థులు చాలా మంది స్పందించిన సందర్భం గా నేను కూడా పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించాలని కోరికతో చేస్తున్నాను అన్నారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతు, యాపర్ల గ్రామ పూర్వ విద్యార్థులు చాలా మంది స్పందించినారు. గ్రామంలో పెద్దలు పాఠాశాల అభివృద్ధి కోసం సహకారం అందించడం శుభపరిణామమని అన్నారు. విద్యార్థులు గ్రామస్థుల సేవాలను ఉపయోగించుకొని బాగా చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రత్నకుమార్ గౌడ్, వినోద్, పాఠశాల హెడ్ మాస్టర్ పలుస శంకర్ గౌడ్, ఉపాధ్యాయులు, ఇందిర, ఈశ్వర్ రెడ్డి, బాలమ్మ, రమేష్, ఆంజనేయులు, కవిత, శివాని తదితరులు పాల్గొన్నారు.


Comments