కాజీపేటలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

కాజీపేటలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

WhatsApp Image 2024-12-06 at 9.22.38 PM కాజిపేట్ తెలంగాణ ముచ్చట్లు

 కాజీపేట లో వాడ వాడాలా రాజకీయ,  సామాజిక, అంబేద్కర్ వాదులు, కుల మతాలకు, పార్టీలకు అతీతంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. 

 చౌరస్తాలో

 టిఆర్ఎస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు టిఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి రమేష్ కు లతోపాటు అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హాజరైన నాయకులు పెద్ద ఎత్తున జై భీమ్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా నార్లగిరి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశంలోనే అన్నగారిని ప్రజలకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. అంబేద్కర్ రాజ్యాధికార దిశగా ఎంతో కృషి చేశాడని ఆయన తెలిపారు. మనకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించినారని అయినా గాని మన హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఇకనైనా మనం అంబేద్కర్ ఆలోచన విధానాలను పాటిస్తూ రాజ్యాధికారం దిశగా ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ఆయన కోరారు. అలాగే కాజీపేట పట్టణంలో చిరు వ్యాపారుల దుకాణాలను ఖాళీ చేపిస్తున్న అధికారులు, అధికార పార్టీ నాయకులు వెంటనే వారికి జీవన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సుంచు కృష్ణ, పాలడుగుల శివకుమార్, ఎండీ ఆఫ్జల్, సిరిమల్లె దశరథం, పాలడుగుల రామస్వామి, పరిగెల వినయ్, దువా నరేష్, కోండ్ర శంకర్, గబ్బెట కరుణ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.


 బాపూజీ నగర్ లో

 పోచమ్మ గుడి ఆవరణలో తే జో మై మాల కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మర్యాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి బండి విజయకుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి సంఘ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కులను కాపాడుకొనుటకు ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలని వారు కోరారు.  రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన రిజర్వేషన్ ను రూపుమాపుటకు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని వీటిని తిప్పికొట్టేందుకు అందరు సంసిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కోశాధికారి పప్పుల గోవర్ధన్, సిహెచ్ కొమ్మలు, కొండా నర్సింగ్ రావు, తండమల్ల వేణు, పట్నం మనోహర్ రావు, మైలారం శంకర్, పరుష వెంకటరాజు, బత్తుల సమ్మయ్య, కాలేశ్వరం వెంకటేష్ ,బండి రామచందర్, పడిదల శేఖర్ ,పార్లపల్లి రాజేష్, జానపట్ల యాదగిరి, బరా బరి ఉప్పల్ రావు, బండారి నరసింహ రావు, గారి కుమార్ స్వామి అల్వాల అనిల్, ఒగ్గుల భద్రయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

 రైల్వే స్టేషన్ లో

 కాజీపేట లోని రైల్వే స్టేషన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ని కురుస పల్లి రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ బన్న ఐలయ్య, స్టేషన్ సూపరిండెంట్ అగ్గి రవీందర్, కాంగ్రెస్ నాయకురాలు సాగరిక, ఎమ్మార్పీఎస్ నాయకుడు సురేందర్, రైల్వే సంగ్ నాయకులు కొత్త మురళి ,డిఎంఆర్కే నాయకులు యమునాకర్ రెడ్డి లు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 డీజిల్ కాలనీలో

 భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని డీజిల్ కాలనీ చౌరస్తాలో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శి పసునూరి మనోహర్ హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ భారతదేశ ప్రజల మన భావాలు తెలిసిన అంబేద్కర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళ అగ్రవర్ణ పేదలకు కార్మిక కర్షకులకు రాజ్యాంగంలో అందరికీ సమానమైన హక్కులు కల్పించిన మహానుభావుడని ఆయన కొనియాడారు. కేవలం ఎస్సీల నాయకుడే కాదు అని ప్రపంచ దేశాలకు ఆరాధ్యుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని ఆయన ఆలోచన విధానాన్ని మంట కలపాలని కొన్ని మతోన్మాద శక్తులు పన్నాగం పండుచున్నారని దానిని అందరం ముక్త కంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో బొడ్డు దేవయ్య, రాజారపు యాదగిరి, కంకణాల సురేందర్, రామగిరి శ్రీనివాస్, బొబ్బిలి రవి, బట్టు దామోదర్, సమ్మయ్య, నందిపాక శంకర్, బి అశోక్, రామ్మోహన్, వనపర్తి అశోక్ తదితరులు హాజరైనారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .