1997-98 బ్యాచ్ శాంతినికేతన్ హైస్కూల్ విద్యార్థుల అ'పూర్వ'  కలయిక

సందడిగా శాంతినికేతన్ హైస్కూల్ రీయూనియన్ 

1997-98 బ్యాచ్ శాంతినికేతన్ హైస్కూల్ విద్యార్థుల అ'పూర్వ'  కలయిక

- 1997-98 బ్యాచ్ శాంతినికేతన్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల కలయిక 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హన్మకొండ సుబేదారిలోని పాలమూరు గ్రిల్ రెస్టారెంట్‌లో ఆదివారం 1997-98 బ్యాచ్ శాంతినికేతన్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల పునఃకలయిక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు వి. సంపత్ కుమారాచార్య, జగన్మోహన్ తదితరులు హాజరయ్యారు. 27 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకే వేదికపై కలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నాటి పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రారంభంలో మిత్రులను కోల్పోయిన సందర్భంగా మౌనం పాటించి నివాళులర్పించారు. ఉపాధ్యాయుడు జగన్మోహన్ మాట్లాడుతూ, “విద్యానికేతన్‌ విద్యార్థుల క్రమశిక్షణ ఈ అపూర్వ కలయికకు నాంది పలికింది” అని పేర్కొన్నారు.

ఈ రీయూనియన్‌లో పూర్వ విద్యార్థులు తమ జీవిత గమ్యాల గురించి పంచుకుంటూ, దేశం-విదేశాల నుండి వచ్చి తమ మిత్రులను కలుసుకోవడం సంతోషకరమని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకరికొకరు గౌరవం తెలియజేస్తూ, పాఠశాల రోజుల జ్ఞాపకాలను మళ్లీ ఒక్కసారిగా జీవింపజేశారు.

సమావేశం ముగింపులో ఆత్మీయ మిత్రత్వాన్ని కొనసాగిస్తూ, తమ పాఠశాల విలువలను భవిష్యత్ తరాలకు ఆవిష్కరించేలా శ్రమిస్తామని పునరుద్ఘాటించారు. ఈ రీయూనియన్ పూర్వ విద్యార్థుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .