అంగన్వాడి టీచర్లు, హెల్పర్స్ అక్రమ అరెస్టును ఖండించాయి
మేడ్చల్, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ (సిఐటియ) అధ్యక్షురాలు జి. సునీత నేతృత్వంలో అలియాబాద్, ముడుచింతలపల్లి సెక్టార్‌లో అంగన్వాడి టీచర్లు, హెల్పర్స్ అక్రమంగా అరెస్ట్ చేయబడిన ఘటనను తీవ్రంగా ఖండించారు.యూనియన్ ఈ చర్యను ప్రజా పాలనపై నియంతృత్వ విధానంగా విశ్లేషిస్తూ, ప్రభుత్వాన్ని వెంటనే స్పందించమని డిమాండ్ చేసింది.యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నట్లుగా, ప్రీప్రైమరీ మరియు పి.ఎం . శ్రీవిద్య తరగతులను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలనీ, విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీ ఉద్యోగులకే ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలనీ, ఒకే ఆన్లైన్ యాప్ అమలు చేయాలని, 5జి నెట్‌వర్క్‌తో కూడిన మొబైల్ ఫోన్లు అందించాలనీ వారు పునరావృతంగా ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారని తెలిపారు.ప్రజాసేవలో భాగంగా గతంలో ఇచ్చిన హామీలను కూడా అందజేయకపోవడం, ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రూ. 18,000/- వేతనం, పి.ఎఫ్ అమలు, ఐ సి డి ఎస్ మంత్రి హామీ ప్రకారం 24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, 3 నెలల పిఆర్సి, మినీ టీచర్స్ 11 నెలల ఏరియర్స్, రిటైర్మెంట్ అయినవారికి 10 నెలల సి.బి.ఇ బకాయిలు చెల్లించాలనే డిమాండ్లను ప్రభుత్వం ఇంకా పూరించకపోవడం యూనియన్ ఆగ్రహానికి కారణమైందని తెలిపారు.ఇవ్వాల్సి న ఖాళీ పోస్టులను భర్తీ చేయక పోవడం కారణంగా ప్రస్తుత ఉద్యోగుల పని భారం పెరుగుతున్నది. యూనియన్ ప్రభుత్వాన్ని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కఠినంగా డిమాండ్ చేసింది.


Comments