కాంగ్రెస్‌లో ఏమైనా జరగొచ్చు..!

కమీషన్ల విషయంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని ఆరోపణ  

కాంగ్రెస్‌లో ఏమైనా జరగొచ్చు..!

-వాళ్లలో వాళ్లు ఏమైనా చేసుకోవచ్చు 

-14 శాతం కమిషన్ మీదే ప్రభుత్వం బతుకుతోందని సంచలన ఆరోపణ

-కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు 

-అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ 

కరీంనగర్,తెలంగాణ ముచ్చట్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పరోక్షంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు గొప్పో పవన్ కల్యాణ్‌కే తెలియాలని అన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేసినట్లుగా పవన్ కల్యాణ్ భావిస్తున్నారా అని ప్రశ్నించారు. పుష్ -2 మూవీ కలెక్షన్లలో రేవంత్‌కు 14 శాతం వాటా ముట్టిందేమోననే అనుమానం తనకు ఉందని సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ ఎందుకు పెట్టారంటే.. అల్లు అర్జున్ కోసం అన్నట్లుగా ఉందని విమర్శించారు. అల్లు అర్జున్‌కు రేవంత్‌కు ఎక్కడో చేడిందని ఆరోపించారు. ఒక వ్యక్తి గురించి ఇంతగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏంటని బండి సంజయ్ నిలదీశారు. కాంగ్రెస్‌లో అంత్యర్యుద్ధం జరుగుతోందని బండి సంజయ్ విమర్శించారు.

కమీషన్ల విషయంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని అన్నారు. కాంగ్రెస్‌లో ఏమైనా జరగొచ్చు.. వాళ్లలో వాళ్లు ఏమైనా చేసుకోవచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు. 14 శాతం కమీషన్ మీదే ప్రభుత్వం బతుకుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముగ్గురు మంత్రుల బండారం బయట పెడతానని హెచ్చరించారు. బ్రోకర్లను పెట్టుకుని బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మంత్రులందరికీ సీఎం కావాలని ఉందని అన్నారు. ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లే.. సీఎం పదవి నిలబడుతోందని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుంటే మంత్రుల కుర్చీలు కూడా ఉండవని బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .