సిఎం కప్ ఛాంపియన్షిప్ ట్రోఫ్రి క్రీడల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
Views: 18
On
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ముఖ్యమంత్రి ఛాంపియన్షిప్ ట్రోఫ్రి (సిఎం కప్) క్రిడల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్‌లో జిడిబ్ల్యూఎంసి కమీషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి సీఎం కప్ క్రీడల నిర్వహణపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27 నుండి జనవరి 2 వరకు హనుమకొండలో రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి ఛాంపియన్షిప్ ట్రోఫీ నిర్వహించడం జరుగుతుందని, అందుకోసం జిల్లాలో ఉన్న పాఠశాలలు, గ్రామస్థాయిలో యువతి, యువకులు రిజిస్టర్ చేసుకొని మండల స్థాయి నుండి క్రీడలు నిర్వహించడం జరిగిందని ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ఈనెల 27 నుండి జనవరి 2వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారుల కోసం వసతి, భోజనం, రవాణా తదితర సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, క్రీడలు జరుగు ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ,రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసే సీఎం కప్ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అశోక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments