సర్జరీ అనంతరం మృతి చెందిన ఏఆర్ పిసి చరణ్ కుమార్

రాచకొండ సీపీ సుధీర్ బాబు నివాళులర్పణ

సర్జరీ అనంతరం మృతి చెందిన ఏఆర్ పిసి చరణ్ కుమార్

హైదరాబాద్‌, అక్టోబర్‌ 24 (తెలంగాణ ముచ్చట్లు):

రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఆర్మ్డ్‌ రిజర్వ్‌ పోలీసు కానిస్టేబుల్‌ వి. చరణ్ కుమార్ (34) అనూహ్యంగా మరణించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీ జి ఏ బి ఎన్)లో డిప్యూటేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన, ఇటీవల ముంబై ఆపరేషన్‌ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.సెప్టెంబర్‌ 23న జరిగిన ఆ ప్రమాదం లో చరణ్ కుమార్‌ కాలి శిన్‌ బోన్‌ విరిగిపోయింది. మొదట స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన గాయం మానకపోవడంతో,మలక్‌పేట్‌ యశోద ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించారు. WhatsApp Image 2025-10-29 at 7.27.11 PMఅక్కడ వైద్యులు చిన్న సర్జరీ అవసరమని సూచించడంతో అక్టోబర్‌ 16 మరియు 24 తేదీలలో రెండు సర్జరీలు చేశారు.అక్టోబర్‌ 24న మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆయనను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి చేరుకున్న కొద్ది సేపటికే సుమారు మధ్యాహ్నం1.45 గంటల సమయంలో మూర్ఛపోయి పడిపోవడంతో, కుటుంబ సభ్యులు వెంటనే మళ్లీ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయనను డాక్టర్లు మృతుడిగా ప్రకటించారు.చరణ్ కుమార్ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరుల్లో తీవ్ర విషాదాన్ని నెలకొలిపింది. ఆయన వయస్సు 34 సంవత్సరాలు. వెనుక భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.మరణవార్త తెలిసిన రాచకొండ పోలీస్ కమిషనర్‌ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ బుధవారం రోజు యశోద ఆసుపత్రికి వెళ్లి చరణ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి పోలీస్‌ శాఖ తరఫున అన్ని విధాల సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .