గ్రామాల్లో ఉపాధి పై ఆడిట్
ఏపీవో ప్రేమయ్య
స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేసిన పనులపై సోషల్ ఆడిట్
ఏపీవో ప్రేమయ్య మాట్లాడుతూ ఎంపీడీవో ఆదేశానుసారం
ఘనపూర్ మండలం నందు నిర్వహించిన 17 వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక తేది 06-08-2025 రోజున ఉదయం 10.00 గంటలకు మండల పరిషత్ కార్యలయం స్టేషన్ ఘనపూర్ లో హాజరు కావాలని కోరారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఘనపూర్ స్టే. మండలంలోని 18 గ్రామాలలో తేది 01-04-2024 నుండి తేది: 31-03-2025 వరకు జరిగిన పనులపై సామాజిక తనిఖి బృందాలు తనిఖి నిర్వహించి, అనంతరం గ్రామాలలో గ్రామసభలు పూర్తిచేసిన తర్వాత తుది నివేదికలను అధికారులకు సమర్పిస్తామన్నారు మండల స్థాయి" ప్రజావేదిక" ను తేది: 06-08-2025 బుదవారము రోజున ఉదయం 10.00 గంటలకు మండల ప్రజా పరిషత్ ఘనపూర్ స్టే. కార్యలయ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నామని ఇట్టి ప్రజావేదికకు సంబందిత అధికారులు అందరూ సకాలములో హాజరవ్వాలని కోరారు.


Comments