పెద్ద పెండ్యాల రైతు వేదికలో నేలల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

పెద్ద పెండ్యాల రైతు వేదికలో నేలల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

పెద్ద పెండ్యాల గ్రామంలో ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా రైతు వేదికలో రైతులకు నేలల సంరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సదస్సులో వరి కొయ్య కాల్చడం వల్ల భూమికి, వాతావరణానికి కలిగే ప్రమాదాలను వివరించడంతో పాటు, దానికి ప్రత్యామ్నాయంగా చేపట్టవలసిన చర్యల గురించి చెప్పడం జరిగింది.

సదస్సులో నిపుణులు పేర్కొన్న అంశాల ప్రకారం, వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి సారాన్ని కోల్పోవడం, ముఖ్యమైన పోషకాలు తగ్గిపోవడం, ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీనికి బదులుగా వరి కొయ్యలను నేలలో కలియదున్నడం ద్వారా సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు 10 శాతం వరకు మెరుగవుతాయని తెలియజేశారు.

పంట అవశేషాలను దుక్కి దున్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లడం ద్వారా అవి రెండు వారాల్లోనే పోషకాలుగా మారుతాయని, దీంతో డీఏపీ వాడకాన్ని సగం వరకు తగ్గించవచ్చని తెలిపారు. ఇంకా, ఈ పద్ధతిలో ఎకరాకు టన్ను వరకు సేంద్రియ ఎరువు తయారవుతుందని, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని వివరించారు.

గ్రామ రైతుల విశేష పాల్గొనికతో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి పవన్ కళ్యాణ్ కీలక సూచనలు అందించారు. రైతులందరూ వరి కొయ్య కాల్చడం మానుకుని, ప్రకృతి సారాన్ని పెంపొందించే పద్ధతులు అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .