పోలీస్ స్మారక దినోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ
విద్యార్థుల్లో భద్రతా అవగాహన పెంపు లక్ష్యంగా షీ టీమ్స్ కార్యక్రమం
కాప్రా, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
పోలీస్ స్మారక దినోత్సవ వేడుకల భాగంగా రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ మార్గదర్శకాల్లో రాచకొండ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం కుషాయిగూడ రాధిక ఎక్స్ రోడ్ సమీపంలోని ఒమేగా జూనియర్ కళాశాలలో జరిగింది. విద్యార్థుల్లో మహిళా భద్రత, వేధింపులు, సోషల్ మీడియా దుర్వినియోగాలు, ర్యాగింగ్ వ్యతిరేకత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు మరియు వాటి చట్టపరమైన పరిణామాలపై డి.సి.పీ , టి. ఉషా రాణి (మహిళా భద్రత, రాచకొండ) అవగాహన కల్పించారు.విద్యార్థులు లేదా మహిళలు ఏవైనా వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటే వెంటనే రాచకొండ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్ 8712662111 కు సమాచారం ఇవ్వాలని లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేయాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో ఏసీబీ అధికారి వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ ఎం. ముని, ఎస్‌ఐ ఎం. రాజు, కుషాయిగూడ షీ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన పెంపు ద్వారా సమాజంలో భద్రతా వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.


Comments