అయ్యప్ప భక్తి నడుమ మహా అన్నదానం

అతిథులుగా ట్రాఫిక్ సిఐ అప్పల నాయుడు, ఎస్ఐ సాగర్

అయ్యప్ప భక్తి నడుమ మహా అన్నదానం

ఖమ్మం బ్యూరో, నవంబర్ 11, తెలంగాణ ముచ్చట్లు;

ఖమ్మం 60వ డివిజన్‌ రామన్నపేట బొమ్మ స్వామి గుడి లో అయ్యప్ప స్వాముల భక్తి వైభవం కన్నులపండువగా వెల్లివిరిసింది. మండల దీక్షల ముగింపు సందర్భంగా కాలనీలోని బొమ్మ స్వామి గుడి ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజన-కీర్తనలు నిర్వహించారు.WhatsApp Image 2025-11-11 at 8.22.55 PMఅనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సిఐ అప్పల నాయుడు, ఎస్ఐ సాగర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. నిర్వాహకులు వారిని సాంప్రదాయ మర్యాదలతో  ఘనంగా సత్కరించారు. స్వామివారి దర్శనం అనంతరం సిఐ అప్పల నాయుడు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం గురుస్వామి గొలుసుల తిరుమలరావు ఆధ్వర్యంలో జరిగింది. శరణు శరణు అయ్యప్ప నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. ఈ వేడుకలో గురుస్వాములు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, తాడబోయిన రాంబాబు, చింతకాయల అంజయ్య, బరిగల శేఖర్, బార్ అనిల్, కట్ల నరసింహారావు, బండి మనోజ్ తదితరులు స్వామి సేవలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .