బలగం మొగిలయ్య’ మృతి

బలగం మొగిలయ్య’ మృతి

వరంగల్ ,తెలంగాణ ముచ్చట్ల..

 వరంగల్ :బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య స్వర్గస్తులయ్యారు. నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన ఆయన గ‌త కొద్ది రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు.కొన్నాళ్లుగా ఇంటి వద్ద వైద్య చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మృతి చెందాడు. కాగా, జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం బ‌లగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ పాట అంద‌రినీ ఏడిపించిన విష‌యం తెలిసిందే. బుడ‌గ‌జంగాల క‌ళాకారులు ప‌స్తం మొగిల‌య్య దంప‌తులు పాడిన ఈ పాట తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కన్నీళ్లు పెట్టించింది

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .