సింగపురం ఇందిరను మర్యాదపూర్వకంగా కలిసిన బాలరాజు,శాగంటి మణి
స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, చిల్పూర్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు బాలరాజు తన జన్మదినం సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానం చేసి, పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.
శాగంటి మణికి శుభాకాంక్షలు తెలిపిన ఇందిరా
ఇటీవల యువజన కాంగ్రెస్ చిల్పూర్ మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైన
చిల్పూర్ మండలం,నష్కల్ గ్రామానికి శాగంటి మణి కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సింగపురం ఇందిరా మణికి శాలువా కప్పి సన్మానించి,శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చిల్పూరు మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ శాగంటి మణి, లింగంపల్లి గ్రామ వైస్ ప్రెసిడెంట్ కందుకూరి రాజు, యువనాయకులు జాని, పున్నంచందర్, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments