శ్రీ గ్లోబల్ హైస్కూల్ నాగలవంచలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు..

బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక.... పాఠశాల కరస్పాండెంట్ ఇనుకుల దివాకర్ రెడ్డి. 

శ్రీ గ్లోబల్ హైస్కూల్ నాగలవంచలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు..

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 20, తెలంగాణ ముచ్చట్లు;

చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గ్లోబల్ హై స్కూల్ లో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ పండుగను ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పండుగ ,ఇది ముఖ్యంగా మహిళలు జరుపుకునే పండుగ బతుకమ్మ అనగా " బతుకు అమ్మ," అని అర్థం. అంటే మన కుటుంబం ,పిల్లలు ,భర్త ,తల్లిదండ్రులు అందరూ సుఖసంతోషాలతో బతకాలని ప్రార్థించటమని, ఈ పండుగను అశ్వయుజ శుద్ధ పద్మి నుండి తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారని ,చివరి రోజు " సద్దుల బతుకమ్మ" అంటారని, బతుకమ్మ పండుగలో రంగురంగుల పూలతో, పెద్ద బొమ్మ లాంటి పూలదండలు తయారుచేసి వాటిని నది లేదా చెరువు లేదా బావిలో వదిలేస్తారు అని ,మహిళలు సాంప్రదాయ బట్టలు WhatsApp Image 2025-09-20 at 5.44.26 PMధరించి బతుకమ్మ చుట్టూ చేరి పాటల పాడుతూ ఆటలాడుతూ ఈ పండుగలో తల్లి భూదేవిని, గౌరీదేవిని పూజిస్తారని ,కుటుంబంలో సుఖసంతోషాలు ,ఆరోగ్యం ,సంపద సంతానం, కోసం పూజ చేస్తారని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ అయిన ఇనుకుల సుధాకర్ రెడ్డి ,వాహిని రెడ్డి, కవితా రెడ్డి, తిరుపతిరెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్ అయినటువంటి తన్నీరు రామారావు ,వైస్ ప్రిన్సిపల్ చాపల మడుగు తిరుపతిరావు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొని ఈ పండుగను చాలా ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .