సత్తుపల్లిలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు.!
Views: 20
On
సత్తుపల్లి, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ, తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దసరా సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో వాడవాడలా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
దుర్గమ్మ అమ్మవారి సాక్షిగా మహిళలు పట్టణంలోని అన్ని కాలనీలలో రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, పాటలు పాడుతూ ఆనందంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు.
జవహర్ నగర్, గుడిపాడు, అంబేద్కర్ నగర్, ద్వారకాపురి కాలనీ, జలగం నగర్, గాంధీనగర్, వెంగళరావు నగర్, విరాట్ నగర్, అయ్యగారిపేట, ఎన్టీఆర్ నగర్, హనుమాన్ నగర్, విద్యానగర్, రాజీవ్ నగర్ వంటి పట్టణంలోని వివిధ కాలనీలు, దేవాలయాల వద్ద పిల్లలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటూ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments