వనపర్తి లో బతుకమ్మ సంబరాల గోడపత్రిక ఆవిష్కరణ

టీజీవో జిల్లా అధ్యక్షులు వరప్రసాద్ రావు

వనపర్తి లో బతుకమ్మ సంబరాల గోడపత్రిక ఆవిష్కరణ

వనపర్తి,సెప్టెంబర్27(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల గోడపత్రికను ఘనంగా ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా టీజీవో సంఘం సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ, “బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ప్రత్యేక పండుగ. మహిళల సాంస్కృతిక భాగస్వామ్యం విశేషం” అని తెలిపారు.
వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి మాట్లాడుతూ, “బతుకమ్మ పండుగ పల్లెల నుండి పట్టణాల వరకు ఉత్సాహాన్ని నింపుతుంది. పండుగల ద్వారా తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి తరతరాలకు చేరతాయి” అన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ, “బతుకమ్మ పూల పండుగ మహిళల సృజనాత్మకత, సమైక్యతకు చిహ్నం” అని పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ మాట్లాడుతూ, “గోడపత్రిక ద్వారా పండుగ సాంస్కృతిక ప్రాముఖ్యత మరింత విస్తృతంగా ప్రజల్లోకి చేరుతుంది” అన్నారు.
వనపర్తి జిల్లా టీజీవో అధ్యక్షులు ఎస్. వరప్రసాద్ రావు, కార్యదర్శి ఎన్. సురేష్, అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ, “ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యంతో బతుకమ్మ సంబరాలను మరింత వైభవంగా నిర్వహించాలి” అని తెలిపారు.
అదేవిధంగా అసోసియేషన్ ప్రతినిధులు ప్రభాకర్, ప్రశాంత్ గౌడ్, అఖిల్, నరసింహారెడ్డి, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి రేవతి, శ్రీకృష్ణ, శివతేజ, పర్వతాలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, పూలతో బతుకమ్మలు అలంకరించి సాంస్కృతిక వాతావరణాన్ని సృష్టించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .