స్మార్ట్ కిడ్జ్ లో అంబరాన్నంటిన బతుకమ్మ పూల సంబురం

చప్పట్లతో,కోలాట నృత్యాలతో ఆడి పాడిన విద్యార్థులు

స్మార్ట్ కిడ్జ్ లో అంబరాన్నంటిన బతుకమ్మ పూల సంబురం

తెలంగాణ పూల పండుగ బతుకమ్మలతో చిన్నారుల సందడి

ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 20, తెలంగాణ ముచ్చట్లు;

పూలను దేవతగా భావించి పూజలు అందించే బతుకమ్మ పండుగ సంబరాలు స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం చిన్నారుల ఆనందోత్సవాలతో ఘనంగా నిర్వహించారు.  
పాఠశాల చిన్నారులంతా సాంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మ వేడుకలలో హుషారుగా పాల్గొన్నారు. బతుకమ్మలను పలురకాల పూలతో అందంగా పేర్చి తమ తమ ఇళ్ల నుంచి ప్రత్యేక వస్త్రధారణలతో పాఠశాలకు చేరుకొని బతుకమ్మలను ఉంచి వలయాకారంగా చప్పట్ల తాళాలతో, బతుకమ్మ గేయాలతో ఉత్సాహంగా పూల సంబురాలు నిర్వహించారు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా పరిమితమైన ఈ సంబురాలను పాఠశాలలో  అంబరాన్ని అంటేలా నిర్వహించారు. కోలాటం నృత్యాలతో పాఠశాలలో హోరెత్తించారు. ఔషధ గుణాలు కలిగిన పూలను అందంగా, నేర్పుగా బతుకమ్మలను పేర్చడంతో పాఠశాల చిన్నారులు ఆనందోత్సవాలతో వేడుకలలో మురిసిపోయారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ 
చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ అనాది కాలంగా తెలంగాణ గౌరవ ప్రతిష్టలను బతుకమ్మ సంబురాలు ఇనుమడింప చేస్తున్నాయని పేర్కొన్నారు. WhatsApp Image 2025-09-20 at 5.30.51 PMఆడపడుచుల, చెరువుల పండగగా బతకమ్మ వేడుకలను ప్రకృతి రమణీయతతో ఈ ఉత్సవాలను ఇంటింటా నిర్వహించుకునే పూల సంబురం తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటి చెబుతున్నదని తెలిపారు. ఔషధ గుణాలున్న పూలతో ఎంగిలిపూల బతుకమ్మతో మొదలుకొని సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులపాటు పలు రకాల ఫలహారాలతో ఒకరికొకరు ఆత్మీయంగా,సమైక్యంగా ఉంటూ తమ ఆనందాలను పంచుకునే ప్రత్యేక సంబరాలు బతుకమ్మ వేడుకలలో అందరినీ ఉత్సాహంగా ఉంచుతున్నాయన్నారు. తమ పాఠశాలలో తెలంగాణ ప్రత్యేక సంబురం బతుకమ్మ వేడుకలను నిర్వహించడం ద్వారా మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను పాఠశాల విద్యార్థులకు తెలియజేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .