ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ... 

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ... 

ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్-23, తెలంగాణ ముచ్చట్లు;

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే బతుకమ్మ, ప్రకృతిని పూజించే గొప్ప పండుగ అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారుWhatsApp Image 2025-09-23 at 9.03.25 PM (1).
మూడవ రోజు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,  అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలలో కలెక్టర్ సతీమణితో కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ  వేడుకలలో కలెక్టరేట్లోని వివిధ శాఖలలో ఉన్న మహిళలంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో.... అంటూ ఆట, పాటలతో సందడి చేసిన మహిళలు, ఉద్యోగులతో కలిసి జిల్లా కలెక్టర్ కలిసి ఆడి వారిని ఉత్తేజపరిచారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకొంటూ, కలిసి కట్టుగా అందరూ ఒకేచోట చేరి ఆడుతూ, పాడుతూ బతుకమ్మను పూజించుకొంటారని అన్నారు.   
ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం విద్యార్థినులు, వైద్య శాఖ ఉద్యోగినులు, సిబ్బంది, అందరూ పాల్గొని గౌరమ్మను కొలిచి ఆట, పాటలతో సందడి చేసారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .