బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్పించాల్సిందే.

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్పించాల్సిందే.

బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ జరగాల్సిందే

పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొనాలి.

వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్.

హాసన్ పర్తి, నవంబర్ 10(తెలంగాణ ముచ్చట్లు):

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పురుడు పోసుకున్న కాకతీయ యూనివర్సిటీ గడ్డ మీద మళ్లీ బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ప్రభుత్వం విద్యా,ఉద్యోగ,స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్ ను కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్పించి, బీసీలకు సత్వర న్యాయం చేయాలని మేమేంతో మాకంతా వాటా అంటూ ధర్మంగా పోరాడుతున్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు.సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని ఎస్డీఎల్సీ ప్రాంగణంలో బీసీ విద్యార్థి జేఏసీ కాకతీయ యూనివర్సిటీ చైర్మన్ ఆరేగంటి నాగరాజు గౌడ్ నేతృత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థులు ధర్మదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ధర్మదీక్షను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుండి అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీ కులస్తులకు రిజర్వేషన్లు లేని కారణంగా బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి,అగ్రవర్ణ రాజకీయ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలు గాను, ఓట్లు వేసే యంత్రాలుగాను మిగిలిపోయారన్నారు. దేశంలో అన్ని వర్గాల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటే,కేవలం బీసీలకు మాత్రం రిజర్వేషన్లు లేని కారణంగా రాజకీయంగా,ఆర్థికంగా అణచివేతకు గురిచేయబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.బీసీ విద్యార్థులు చేస్తున్న ధర్మదీక్షతోనైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లను కల్పించేందుకు ముందుకు రావాలని,లేనియెడల ఉద్యమాన్ని గ్రామస్థాయి నుండి పటిష్టం చేసి,గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరుబాట పట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.కేయూ పాలకమండలి సభ్యులు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డా.చిర్ర రాజు  మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పంతానికి పోయి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును అడ్డుకొని బీసీలకు అన్యాయం చేయొద్దని,బీసీ రిజర్వేషన్లను కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని,బిజెపి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు.అగ్రవర్ణ రాజకీయ పార్టీలలోని నాయకులంతా పార్టీలకతీతంగా బీసీ ఉద్యమంలో కలిసి రాకపోతే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. కొందరు అగ్రవర్ణ పార్టీలకు తలోగ్గిన నేతలు బీసీ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు కుట్రలు చేస్తున్నారని వారిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ విద్యార్థులు రిజర్వేషన్లను సాధించేందుకు పోరుబాట పట్టారని వారి పోరాటం ఉగ్రరూపం దాల్చకముందే కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ ధర్మదీక్షను తెలుగు డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి మామిడి లింగయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి బీసీ జేఏసీ వైస్ చైర్మన్లు బోనగాని యాదగిరి గౌడ్, దాడి మల్లయ్య యాదవ్,దొడ్డపల్లి రఘుపతి,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చు ఆనందం, రాష్ట్ర కార్యదర్శి భీమగాని యాదగిరి గౌడ్,బీసీ నాయకులు బక్కి అవినాష్,ప్రొఫెసర్లు మండ సారంగపాణి,శ్రీనివాసరావు,ఆకుతోట శ్రీనివాస్, సంఘాని మల్లేశ్వర్,కృష్ణ యాదవ్,సంకినేని వెంకన్న, రమేష్,బీసీ విద్యార్థి నాయకులు సుమన్,అజయ్, గణేష్,రాజశేఖర్,రాజ్ కుమార్,నితిన్,సంజీవ్, రాజేష్,అనిల్,వినోద్,సాయి కృష్ణ,మహేష్,నాగరాజ్ యాదవ్,నాగరాజు పటేల్,చిర్ర సుమన్,వేముల మహేందర్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .