బీసీ రిజర్వేషన్లు 42 శాతం అనివార్యంగా అమలు చేయాలి.
బీసీ హక్కుల రాష్ట్ర సాధన సమితి ఉప ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి
హాసన్ పర్తి, అక్టోబర్ 09(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలన్నీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది.కానీ టిఆర్ఎస్,బిజెపి దొడ్డిదారిన కొంతమందిని ప్రోత్సహించి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేయించడం దుర్మార్గమైన చర్య అని హైకోర్టు స్టే ఇవ్వడం ఆక్షేపణీయమని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి అన్నారు. గురువారం రోజున హనుమకొండ బాలసముద్రం లో జరిగిన సమావేషానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాసనసభ ద్వారా చేసిన శాసనాన్ని గవర్నర్ పెండింగ్ లో పెట్టడం కోర్టు స్టే ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాలు చేయడమే అని తెలిపారు. జీవో నంబర్ 9 ద్వారా రిజర్వేషన్లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతించవలసింది పోయి దొడ్డి దారి ద్వారా అడ్డుకోవడం అప్రజా స్వామీకమన్నారు. 56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కాదని కోర్టు తీర్పులు బ్రహ్మ పదార్థం కాదని ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నిర్ణయాలే శిరోధార్యం కావాలని పేర్కొన్నారు. సామాజిక న్యాయం రాజకీయరంగంలో స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా నిర్వర్తించే ప్రభుత్వ ఉత్తరువులను స్వాగతించాల్సిన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం విచారకరమని హైకోర్టు చెప్పినట్లు వెంటనే రాజకీయ పార్టీలు 42 శాతం రిజర్వేషన్స్ మద్దతు తెలుపుతూ ఇంప్లీట్స్ చేయాలని ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకట్ రాములు,జిల్లా అధ్యక్షుడు సదానందం,న్యాయవాది సామాజికవేత్త సాయిని నరేందర్,దొమ్మాటి ప్రవీణ్ కుమార్,గుంటి రాజేందర్, కే.రవి తదితరులు పాల్గొన్నారు.


Comments