మరో రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండండి.
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
మరో రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని,వర్షాల వల్ల ప్రభావితం ఆయన రోడ్లు కాలువలు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులను ఆదేశించారు.జిల్లాలో భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా మరో రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సులభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి అందరూ మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాల వల్ల జరిగిన నష్టాలు ప్రస్తుతం అత్యవసరంగా చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో భారీ వర్షాలు నమోదు అయిందప్పటి కిని ఇప్పటివరకు ఎలాంటి ప్రాణం నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నందుకు అధికారులు సిబ్బందిని అభినందించారు. మరో రోజులు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఇప్పటివరకు జరిగిన నష్టాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి రేపు సాయంత్రం లోగా సమర్పించాలని సూచించారు. రోడ్లు పునర్జీకరణ. కాలువల మరమతులు వేగం జరగాలని ఆదేశించారు.


Comments