మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్, కేరళ ఎక్స్‌ప్రెస్ ఆపాలని డిమాండ్ – ఎంపీ వంశీకృష్ణ
Views: 23
On
మంచిర్యాల:
మంచిర్యాల సింగరేణి ప్రాంతం నుంచి రైల్వే శాఖకు ఏటా సుమారు 10 వేల కోట్లు నుంచి 15 వేల కోట్లు వరకు ఆదాయం వస్తోందని, ఇంత పెద్ద రెవెన్యూ ఇచ్చే ఈ ప్రాంత ప్రజలకు రైళ్లు ఆగడం లేదని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్నాళ్లుగా వందే భారత్, కేరళ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మంచిర్యాలలో ఆపాలని కోరుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన విమర్శించారు. సింగరేణి కార్మికులు, ప్రజలు, విద్యార్థుల ప్రయాణాలకు ఈ రైళ్లు కీలకమని ఆయన గుర్తు చేశారు.
“మన బొగ్గు తీసుకెళ్లి ఆదాయం చేసుకుంటున్నారు, కానీ మంచిర్యాలలో రైళ్లు ఆపడం లేదు. ఇది తక్షణమే సరిచేయాలి” అని వంశీకృష్ణ హెచ్చరించారు. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజల తరఫున మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్, కేరళ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments