కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ నేతృత్వంలో రత్న హోటల్ వేదికగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల గారడీని నిర్దాక్షిణ్యంగా వెలికితీస్తూ, వారి 6 గ్యారంటీలను 66 మోసాలు, 420 హామీలుగా అభివర్ణించారు.
కాంగ్రెస్ హామీలపై విమర్శలు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసింది కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైందని అరూరి రమేష్ తెలిపారు. ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బీజేపీ పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసి, తెలంగాణలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్, వరంగల్అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, పాదయాత్ర ప్రముఖ్ రత్నం సతీష్ షా, వర్ధన్నపేట అసెంబ్లీ ప్రముఖ్ బన్న ప్రభాకర్, నర్సంపేట ఎమ్మెల్యే కంటెస్టెంట్ పాపారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు జలగం రంజిత్, రాణా ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments