బీసీలకు జరిగిన అన్యాయానికి బీజేపీ నైతిక బాధ్యత వహించాలి

బీసీలకు జరిగిన అన్యాయానికి బీజేపీ నైతిక బాధ్యత వహించాలి

ఏ.ఎస్.రావు నగర్, అక్టోబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు)

బీసీలకు జరుగుతున్న అన్యాయానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి విఎస్. బోస్ బీజేపీ పార్టీ నైతిక బాధ్యత వహించాల్సిందని డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు పిలిచిన బంద్ కార్యక్రమాన్ని సీపీఐ, కాంగ్రెస్, బీసీ సంఘాలు కలిసి విజయవంతం చేశారు. ఈసీఐఎల్ చౌరస్తా నుండి కుషాయిగూడ, కమలనగర్, ఏ.ఎస్. రావు నగర్ ప్రాంతాల్లో జెండాలు చేతబూంచి, వాణిజ్య సంస్థలు, హోటల్స్, పాఠశాలలను బంద్ చేయించి, అనంతరం ఈసీఐఎల్ అంబేద్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ కార్యదర్శి విఎస్. బోస్, కాంగ్రెస్ పార్టీ ఏ.ఎస్. రావు నగర్ అధ్యక్షుడు కెశెట్టి ప్రసాద్, సీపీఐ రాష్ట్ర నాయకుడు రమేష్ రాజా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్ను 33 శాతంలో 22 శాతంగా తగ్గించి బీసీలకు ద్రోహం చేసిన ఘనత వహించిందని. కొత్తగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి బిల్లు శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపినా, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆ బిల్లును తిరస్కరించి బీసీలకు తీరని అన్యాయం చేసిందని. తాజా సుప్రీంకోర్టు తీర్పు వల్ల బీసీలకు మరింత అన్యాయం జరిగిందని, 50 శాతం స్థానాలను ఇవ్వకుండా, 10 శాతం ఈడబ్ల్యూ ఎస్ అమలు చేయడం ద్వారా బీజేపీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించిందని అన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించడానికి సామాజిక ఉద్యమంగా పోరాటం కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిహెచ్ఎంసి మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొజ్జ రాఘవ రెడ్డి, కొత్త అంజిరెడ్డి, సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. ధర్మేంద్ర, టి. సత్య ప్రసాద్, మహేష్, లక్ష్మణ్, సుదర్శన్, రాజు, కాంగ్రెస్ నియోజకవర్గ నేతలు, రాష్ట్ర ఓబిసి కన్వినర్ పాత కోటి రామలింగం, సుంకు శ్రీకాంత్ రెడ్డి, నర్సింహా, సందీప్ గౌడ్, ప్రకాష్, అరుణ్, చిందం బల్ నర్సింహా, మధు, ప్రదీప్ తదితరులు, పాల్గొన్నారు.IMG-20251018-WA0023

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .