పెద్దమందడి లో బిజెపి మండల సంకల్ప సభ

వికాసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పెద్దమందడి లో బిజెపి మండల సంకల్ప సభ

 వనపర్తి మాజీ జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి 

WhatsApp Image 2025-07-04 at 9.40.59 PM

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు: 

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామాలలో ప్రజలకు వివరించాలని వనపర్తి

మాజీ జడ్పీ చైర్మన్ లోపు నాథ్ రెడ్డి శుక్రవారం పెద్దమందడి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య అధ్యక్షతన మండల సంకల్ప సభ సమావేశం నిర్వహించారు. ఈ సంకల్ప సభ సమావేశానికి ముఖ్యఅతిథిగా వనపర్తి మాజీ జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో 11 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఈ కార్యక్రమాలను రచ్చబండ , సంకల్ప సభల ద్వారా ప్రజలకు తెలియజేయాలని బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.  కాంగ్రెస్ 420 హామీల  వైఫల్యాలను ఎండగడుతూ బిజెపి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అశ్విని రాధమ్మ, బిజెపి మాజీ మండలాధ్యక్షుడు కావలి తిరుపతయ్య, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు సి.యాదయ్య, బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు రామ్ నరేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శలు సుక్క మధు, దత్తాత్రేయ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు విటల్ రెడ్డి, విష్ణువర్ధన్,  బాలరాజు,  కృష్ణయ్య, కిషన్ నాయక్, బాబన్న, స్వాతి బీజేపీ మండల ఉపాధ్యక్షులు, ఏర్పుల రాము, రవి, చిన్న గుంట రాము, జి.వెంకటేష్, మండల కార్యదర్శి రవి, యువమోర్చా మండల అధ్యక్షుడు రుక్మారెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు సరస్వతి, భూత్ అధ్యక్షులు యాదయ్య, హనుమంతు నాయక్, లాల్ సింగ్, పురుషోత్తం, అనిల్ యాదవ్, రామకృష్ణ, వెంకటాచారి, శివకుమార్,  కావలి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .