కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ...బీజేపీ యాత్రా

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ...బీజేపీ యాత్రా

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

హన్మకొండలోని హంటర్ రోడ్ క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొన్నారు. డిసెంబర్ 1 నుండి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టబోయే యాత్రా కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలు చర్చించబడ్డాయి.WhatsApp Image 2024-11-30 at 9.43.25 PM

ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో జరిగిన వైఫల్యాలపై చార్జిషీట్ సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి డివిజన్, మండల స్థాయిలో బైక్ ర్యాలీల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరాన్ని స్పష్టంచేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పాదయాత్ర ప్రాముఖ్ రత్నం సతీష్ షా, అసెంబ్లీ ప్రాముఖ్ బన్న ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, తక్కలపల్లి రాజేశ్వరరావు, జలగం రంజిత్, నాంపల్లి శ్రీనివాస్, వన్నాల వెంకటరమణ, మజ్జిగ జైపాల్, మాజీ జెడ్పిటిసి రేణికుంట్ల సునీత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .