తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బొల్లెపాక రాజేష్

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బొల్లెపాక రాజేష్
తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బొల్లెపాక రాజేష్

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ, హన్మకొండ జిల్లాకు  చెందిన సీనియర్ జర్నలిస్టు బొల్లెపాక రాజేష్ ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బూరుగుల నాగేందర్ ఒక ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ ముచ్చట్లు తెలుగు దినపత్రిక సంపాదకుడు అయిన బొల్లెపాక రాజేష్, జర్నలిజం రంగంలో ఉన్నత సేవలు అందించడంతో పాటు మాదిగ సమాజ అభ్యున్నతికి చేసిన కృషిని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగేందర్ తెలిపారు.రాజేష్, హన్మకొండ జిల్లాలో ఒక సామాజిక కార్యకర్తగా ప్రజల మన్ననలు పొందారు. ఆయన అనుభవం, జర్నలిజం రంగంలో నైపుణ్యం, మాదిగ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషి, ఫోరమ్ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఫోరమ్ కమిటీ పేర్కొంది.రాజేష్ మాట్లాడుతూ,ఈ బాధ్యతతో సమాజ సేవలో మరింత అంకితభావంతో ముందుకు సాగుతానన్నారు. మాదిగ జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంలో, వారి అభ్యున్నతికి కృషి చేయడంలో నా సహకారం కొనసాగుతుంది” అని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు బూరుగుల నాగేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .