మృతురాలి కుటుంబానికి బిపిఎల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
Views: 6
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామానికి చెందిన బోయ మణెమ్మ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు కొంతకాలంగా కమిటీగా ఏర్పడి బిపిఎల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని గ్రామంలో కొన్ని సేవా కార్యక్రమాలు, అలాగే నిరుపేదలు చనిపోయిన వారి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే బిపిఎల్ ఫౌండేషన్ సభ్యులు సోమవారం మణెమ్మ మృతికి సంతాపం తెలిపి వారి కుటుంబానికి 5000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మణెమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గణేష్, శ్రీధర్ యాదవ్, కురుమూర్తి యాదవ్, నరసింహ, మహేష్, ఆంజనేయులు, మల్లేష్, అశోక్, అంజి, మన్నెం తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments