కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ బాకీ కార్డు ఉద్యమం

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ బాకీ కార్డు ఉద్యమం

మల్లాపూర్, అక్టోబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు):

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసిందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన "బాకీ కార్డు" ఉద్యమంలో భాగంగా మల్లాపూర్ ప్రాంతంలో ఇంటింటా తిరిగి బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బాకీ ఉందో ఇంటింటికి ఈ బాకీ కార్డుల ద్వారా వివరించి, వారి మోసాలను ఎండగట్టాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి” అని పిలుపునిచ్చారు.రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళా పథకాలు, యువజన ప్రోత్సాహక పథకాలు తదితర హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.“ప్రజలకు హామీల పేరుతో లక్షలాది రూపాయల బాకీ పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఆ మొత్తాలను చెల్లించాలి” అని డిమాండ్ చేశారు.“కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏం చేశాడు?” అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .