ఎన్నికలు ఎప్పుడొచ్చినా బిఆర్ఎస్ సిద్ధంగా ఉంది
పెద్దమందడి మండల అధ్యక్షుడు వేణు యాదవ్
పెద్దమందడి,అక్టోబర్8(తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని పెద్దమందడి మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు వేణు యాదవ్ అన్నారు. మండలంలోని వెల్టూర్ గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వేణు యాదవ్ మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగినా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థాయిలో బిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో గత దశాబ్దంలో మండలంలోని గ్రామాలు ఎన్నో అభివృద్ధి సాధించాయని ఆయన గుర్తుచేశారు. ఆ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలపరచాలని సూచించారు. మన గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే బిఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలి. వర్గ విభేదాలు పక్కనబెట్టి అందరం ఒక్కటిగా పనిచేయాలి అని వేణు యాదవ్ తెలిపారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నందున కార్యకర్తలు గ్రామస్థాయిలో ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాలని సూచించారు. స్థానిక నాయకుల అర్హత,రిజర్వేషన్ల ప్రకారం అందరికీ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments