పెద్దమందడి లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బాకీ కార్డు ప్రచారం
ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి ప్రజలకు పిలుపు
వాకిటి శ్రీధర్ బిఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి
వనపర్తి,అక్టోబర్9(తెలంగాణ ముచ్చట్లు):
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎండగడుతూ బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డు ద్వారా కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు వివరించారు. జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో పెద్దమందడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ₹2500, వికలాంగులకు ₹6000, వృద్ధులు మరియు వితంతువులకు ₹4000 పెన్షన్, ‘కల్యాణ లక్ష్మి’ పథకంలో తులం బంగారం వంటి హామీలతో ప్రజలను మోసం చేసిందని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు గడిచిన ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నందిమల్ల అశోక్, జిల్లా మాజీ రైతుబంధు అద్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, పెద్దమందడి మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు వేణు యాదవ్, మాజీ ఎంపీపీ దయాకర్, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు విట్ట శ్రీనివాస్ రెడ్డి, మండల గొర్రెల కాపరి చైర్మన్ నాగేంద్ర యాదవ్, రామేశ్వర్ రెడ్డి, సింగిరెడ్డి కురుమూర్తి, రఘువర్ధన్ రెడ్డి, పానుగంటి సురేష్ కుమార్, సేనాపతి, మల్లక్ సురేష్ కుమార్, విష్ణు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments